Telugu News » Blog » పాకిస్తాన్ సూప‌ర్‌లీగ్ లో కోహ్లీ పోస్ట‌ర్ ద‌ర్శ‌నం..!

పాకిస్తాన్ సూప‌ర్‌లీగ్ లో కోహ్లీ పోస్ట‌ర్ ద‌ర్శ‌నం..!

by Anji
Ads

భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో అభిమానులు ఉన్న విష‌యం తెలిసిందే. పాకిస్తాన్‌లో విరాట్‌ను ఆరాధించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అత‌డు క్రీజులో కుదురుకుంటే అభిమానుల‌కు పండే. క‌ళాత్మ‌క షాట్ల‌తో అల‌రిస్తుంటాడు. త‌న బ్యాటింగ్ తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు.

Ads

Also Read :  ఐర‌న్ లెగ్ శాస్త్రికి సినిమాల్లో అవ‌కాశం ఎలా వ‌చ్చిందో తెలుసా…!

Ads

పాకిస్తాన్‌లో జ‌రుగుతున్న పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అభిమాని విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌లో సెంచ‌రీ కొడితే చూడాల‌ని ఉంద‌ని రాసి ఉన్న పోస్ట‌ర్‌ను ప‌ట్టుకుని క‌నిపించాడు. ఆ ఫోటోను పాక్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకుని గ‌డాఫీ స్టేడియంలో ఓ వ్య‌క్తి ఇలా అభిమానం చాటుకున్నాడు అనే వ్యాఖ్య‌ను జ‌త‌ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో విరాట్ సెంచ‌రీ న‌మోదు చేయ‌క రెండేండ్ల‌కు పైగా అవుతోంది. చివ‌రి సారి న‌వంబ‌ర్ 2019లో శ‌త‌కం బాదాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడంకెల స్కోరు న‌మోదు చేయ‌లేదు. అయినా అత‌ని స‌గ‌టు 40 కి పైగా ఉండ‌డం విశేషం.

Ad

Also Read :  నువ్వులేని జీవితం ఊహించ‌లేను..ఆ ఫోటో షేర్ చేసి స‌మంత ఎమోష‌న‌ల్..!