వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌లలో భారత్ ఘనవిజయం సాధించి 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ టీ-20 ర్యాంకుల్లో భారత జట్టు అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత టీమిండియా టీ 20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. పూర్తికాలం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత వచ్చిన వన్డే సిరీస్‌ను, టీ-20 సిరీస్‌ను వరుసగా క్లీన్ స్వీప్ చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ 20లలో ఇది వరుసగా మూడవ క్వీన్ స్వీప్ చేశాడు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు
Advertisement
Advertisement
అందులో వెస్టిండిస్ జట్టును రెండు సార్లు క్లీన్ స్వీప్ చేయగా.. న్యూజిలాండ్ పై ఒకసారి టీ-20 సిరీస్‌ను వైట్ వాష్ చేశాడు. టీమిండియా ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకుపోయింది. టీ-20ల్లో వరుస విజయాలు నమోదు చేయడంతో ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు రెండవ స్థానంలో భారత్.. ఇప్పుడు టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ప్రస్తుతం రెండవ స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉండగా.. మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది.
మరొక వైపు ఈనెల 24వ తేదీ అనగా గురువారం నుంచి స్వదేశంలోనే శ్రీలంకతో మూడు టీ-20ల సిరీస్ ప్రారంభం కానున్నది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. మరీ ఈ సిరీస్‌ను కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందో లేదో చూడాలి మరీ.
Also Read : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం