బ్యాంకు అధికారుల తప్పిదంతో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ముగ్గురు గిరిజనుల ఖాతాల్లో లక్షల రూపాయలు జమా అయ్యాయి. సల్సగూడ గిరిజన మహిళ రమాభాయి ఖాతాలో రూ.9.6 లక్షలు జమా అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులను అదృష్టం వరించింది. వాళ్ల అకౌంట్లలో ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 60 కోట్లు జమా అయ్యాయి.
Also Read : డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !
Advertisement
ఒక్కసారిగా అడవి బిడ్డల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమా కావడంతో ఆదివాసీయులు ఆశ్యర్యానికి లోనయ్యారు. ఖాతాల్లో ఉన్న పైసలను వారి అవసరాలకు సైతం ఉపయోగించుకున్నారు. ఇటీవలే బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆదివాసీయులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఆదిఆబాద్ జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోటు చేసుకుంది. వాస్తవానికి టెక్నికల్ సమస్యల వల్ల అదంతా జరిగిందని అధికారులు వివరించారు.
Advertisement
ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా గిరిజనులపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని అధికారుల వల్లనే ఈ తప్పిదం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా అకౌంట్లలో డబ్బులు జమ చేసి ఉండవచ్చని సదరు నగదును వినియోగించుకున్నారు. రీకవరి పేరుతో అధికారులు వేధిస్తున్నారని గ్రామీణ బ్యాంకును ముట్టడించారు. కస్టమర్ సర్వీస్ పాయింట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయి. మామిడిగూడ సీఎస్పీ ద్వారా రూ.1.28 కోట్లు విత్ డ్రా చేశారు. 3 నెలలుగా డబ్బులు డ్రా అయినా గుర్తించని బ్యాంకు అధికారులు మేము ఖర్చు చేసిన తరువాత ఇప్పుడు డబ్బులు చెల్లించాలంటే ఏవిధంగా చెల్లించాలని గిరిజనులు వాపోతున్నారు.
Also Read : బుక్ మై షోకు భీమ్లానాయక్ డిస్ట్రిబ్యూటర్ షాక్..!