ఐపీఎల్ 2022 మార్చి 27 నుండి ప్రారంభం అవుతుంది. టోర్నమెంట్ చివరి మ్యాచ్ మే 28న నిర్వహించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణెలోని 6 గ్రౌండల్లో జరిగే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో లీగ్ దర్శలో మొత్తం 70 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ముంబైలో జరిగే అన్ని మ్యాచ్ లు వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో నిర్వహించే అవకాశముంది. టోర్నీ షెడ్యూల్ ను ఫిబ్రవరి చివరి వారంలో బీసీసీఐ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 రెండు కొత్త జట్లు ఆడబోతున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లు ఏడాది ఆరంగేట్రం చేస్తూ ఉన్నాయి. ఆర్పీఎస్జీ గ్రూపునకు చెందిన లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యానాథ్ ను కలిశారు. జట్టు కెప్టెన్ గా కే.ఎల్.రాహుల్‌ను నియమించింది. తొలిసారిగా లక్నో జట్టు ఐపీఎల్లో ఆడబోతుంది. ఈ సమయంలో గంభీర్, సంజీవ్ గోయెంకా యోగి ఆదిత్యనాథ్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు.
Advertisement
Advertisement
Also Read : ఐఎస్ఐ చీఫ్‌ను దాచిన ఇమ్రాన్ ఖాన్..!
ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరొక సారి చర్చల్లోకి వచ్చింది. వేలంలో కొందరూ ఆటగాళ్లను అధిక ధరలకు కొనుగోలు చేయడంతో మనస్థాపానికి గురైన అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ సైమన్ కటిచ్ రాజీనామా చేశాడు. అతని స్థానంలో ప్రస్తుతం సైమన్ హెల్మోట్ జట్టుకు సహాయ కోచ్‌గా వ్యవహరించాడు.
అతని స్థానంలో ప్రస్తుతం సైమన్ హెల్మోట్ జట్టుకు సహాయ కోచ్‌గా వ్యవహరించాడు. సైమన్ ఆస్ట్రేలియా కు చెందిన వాడు. గతంలో బీబీఎల్ మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. వెస్టిండిస్ గ్రేట్ బ్రియాన్ లారా, భారత మాజీ బ్యాట్స్ మెన్ హేమంగ్ బదానీలను సన్ రైజర్స్ సహాయక సిబ్బందిలో చేర్చారు. ప్రధాన కోచ్‌లు టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వేలం తరువాత కాటిచ్ రాజీనామా చేసారు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి వ్యాపారం అనుకూలం