కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ప్రధానంగా అంతరిక్షం గురించిన విషయాలకు చాలా ఆసక్తి ఉంటుంది. వేరే గ్రహాల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది… అక్కడ ఏం జరుగుతుంది… మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అక్కడ నీటి గురించి కూడా తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తిని కలిగించే విషయం.
Advertisement
Advertisement
భూమి మీద నుంచి కొంత నీటిని పట్టుకువెళ్ళి అంతరిక్షంలో పారబోస్తే ఏమవుతుంది అనేది ఆసక్తికర విషయం. నీళ్లు భూమి నుంచి తీసుకు వెళ్లి అంతరిక్షంలో పోస్తే, ఆ నీళ్లు వెంటనే ఆవిరిగా మారిపోతాయి. అవి ఆవిరి కావడమే కాదు… ఎంత ఒత్తిడి అప్లై చేసినా సరే అక్కడ ఉన్న వేడి కారణంగా అవి నీళ్ళు గా మారే అవకాశమే లేదు. సముద్ర మట్టం నుంచి పైకి వెళ్ళే కొద్ది… వాతావరణంలో ఉండే ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది.
ఆ తగ్గడం అనేది… నీళ్ళ ఉష్ణోగ్రత, బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది. ఆ ప్రెజర్ ఒక లెవల్ కు మించి తగ్గితే నీళ్ళు ద్రవంగా ఉండవు. నీళ్లు సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్ కి డైరెక్ట్ గా మారిపోతాయి. వాతావరణం కు స్పేస్ బౌండరీ లైన్ నిర్వచనం ఇదే. నీళ్లు ఎక్కడైతే లిక్విడ్ స్టేట్లోకి మారలేవో అక్కడ అంతరిక్షం మొదలవుతుంది అన్నట్టు.