భారత్ వర్సెస్ వెస్టిండ్ల మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీ-20 సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే తరువాత టీ-20 సిరీస్ లో శుభారంభం చేసింది. దీంతో మూడు టీ-20ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Also Read : BIGG BOSS OTT : ఫైనల్ లిస్ట్ ఇదే…ఇంకా ఎవరెవరు ఉన్నారంటే…!
Advertisement
Advertisement
భారత కెప్టెన్ రోహిత్ కేవలం 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు బాదేశాడు.స్లోగా బ్యాటింగ్ ఆరంభించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ (35) రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌండరీ వద్ద ఫాబియన్ అలెన్‌కు చిక్కాడు. 93 పరుగుల వద్ద 2వ వికెట్‌ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (17) కూడా పెవిలియన్ చేరాడు. 95 పరుగుల వద్ద మూడవ వికెట్, రిషబ్ పంత్ (08) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (34), వెంకటేష్ అయ్యర్ నిలకడగా ఆడుతూ జట్టును విజయానికి చేర్చారు.
అంతకు ముందు టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. భారత్ తరుపున హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్, చాహల్, దీపక్ చాహర్ తలో వికెట్ తీశారు.