మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాను ముందుగా ఓటిటి కోసం రూపొందించామని చెప్పారు.
Advertisement
సినిమా నిడివి గంటన్నర మాత్రమే ఉంటుందని ….అయితే ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాము అన్నారు. సినిమాలో కంటెంట్ డిమాండ్ మేరకు ఇద్దరమ్మాయిల మధ్య ముద్దు సీన్లు ఉంటాయని మోహన్ బాబు తెలిపారు. అయితే మనకు సొసైటీలో మంచి పేరు ఉందని విద్యాసంస్థలు నడుపుతున్నామని ముందుగా విష్ణు దానికి ఒప్పుకోలేదు అన్నారు.
Advertisement
కానీ కథ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సీన్లు ఓకే చేశామన్నారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లే వ్యక్తి అతని కుటుంబం పడే బాధలు అనే పాయింట్ తో సన్ ఆఫ్ ఇండియా ఉండబోతుందని చెప్పారు. సినిమా మంచి విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే కథ నచ్చి సినిమా తీశామన్నారు. సెన్సార్ వల్ల కొన్ని సీన్లను కట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నామని మోహన్ బాబు చెప్పారు. అయితే సినిమాను ఓటిటిలో విడుదల చేసినప్పుడు మాత్రం ఆ సీన్లను కూడా యాడ్ చేసి విడుదల చేస్తామన్నారు.