ప్రకృతి అందాల పుట్టినిళ్లు అడవుల జిల్లా ఆదిలాబాద్ రారమ్మంటూ పిలుస్తుంది. పక్షుల కిలకిలరావాలు మైమరింపించే జలపాతాలు, నీటి సరస్సులు చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులు హాయిగా పచ్చని ప్రకృతితో సేద దీరేందుకు వెలిసిన వెదురు మంచెలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. విభిన్న రకాల పక్షుల రాకతో తొలిసారిగా జరుగుతున్న బర్డ్ వాక్ ఫెస్ట్‌లో భాగంగా కవ్వాల్ అభయారణ్యం ముస్తాబై కనిపిస్తోంది.
Also Read : సమతామూర్తి సన్నిధిలో అల్లుఅర్జున్.. ఫోటోలు వైరల్..!
Advertisement
అటవీశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తెలంగాణ అటవీ సంపద, జీవ వైవిధ్యం గురించి విద్యార్థులు, పరిశోధకులు, పక్షి ప్రేమికులకు తెలిపేందుకు జన్నారం, ఖానాపూర్ డివిజన్‌లు తొలిసారిగా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఫిబ్రవరి 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్కొక్కరికీ రూ.1500 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసారు నిర్వాహకులు. తొలిసారి కవ్వాల్ అభయారణ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.
Advertisement
కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో చిరుతలు తోడేళ్లు అడవి కుక్కలు, మచ్చలజింకలు, అడవి పిల్లలు, దుప్పులు, అడవి దున్నల సంచారం ఎక్కువగానే ఉంటుంది. అభయారణ్యంలో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్టుగా గుర్తించిన అటవీశాఖ. ప్రకృతి ప్రేమికుల కోసం బర్డ్ వాక్‌ను ఏర్పాటు చేసింది. కవ్వాల్ డివిజన్‌లోని మైసమ్మ కుంట, బైసన్ కుంట, నీలు గాయికుంటతో పాటు కల్పకుంట, గోండుగూడ అటవీ ప్రాంతాల్లో పక్షి ప్రేమికురాలు రాత్రి వేళలో బస చేసేందుకు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపులు అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read : Mukesh Ambani : ముకేష్ అంబానీకి ఇష్టమైన పాట.. ఆయన నోటే వినండి..!