Home » ఎన్టీఆర్‌కు మోసం.. ఆ రోజు రాత్రి అలా జ‌రగ‌డంతో ముర‌ళీ మోహ‌న్‌కు క‌డుపు మండిపోయింద‌ట.!

ఎన్టీఆర్‌కు మోసం.. ఆ రోజు రాత్రి అలా జ‌రగ‌డంతో ముర‌ళీ మోహ‌న్‌కు క‌డుపు మండిపోయింద‌ట.!

by Anji
Ad

తెలుగు సినీ న‌టుడు, టీడీపీ నేత ముర‌ళీ మోహ‌న్ దాదాపుగా తెలుగు ప్ర‌జానికానికి అంద‌రికీ ప‌రిచ‌య‌మే. అప్ప‌ట్లో ఎన్నోసినిమాల్లో న‌టించి ఆయ‌న మంచి పేరునే తెచ్చుకున్నారు. ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూ స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపుగా 350కి పైగా సినిమాల్లో న‌టించారు. 2015 వ‌ర‌కు ఈయ‌న మా అధ్య‌క్షుని బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించారు.

Also Read :  రామ్‌చ‌ర‌ణ్ ఒక మృగం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స్టార్ హీరో ఎవ‌రంటే..?

Advertisement

టీడీపీ త‌రుపున రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. సొంతంగా జ‌య‌భేరి అనే నిర్మాణ సంస్థ‌ను కూడా స్థాపించి ఎన్నో సినిమాల‌ను నిర్మించారు. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. త‌మ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేస్తారు అని, కానీ ఎన్టీఆర్‌కు మాత్రం త‌మ‌కు అభిమాన నాయ‌కుడు అందుకే టీడీపీలో చేరిన‌ట్టు తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంతో శ‌క్తివంతురాలైన ఇందిరాగాంధీని ఎదురించి మ‌రీ గెలిచార‌ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హార్ట్ ఆప‌రేష‌న్ కోసం అమెరికాకు వెళ్లి ఆప‌రేష‌న్ చేయించుకుని తిరిగి వ‌చ్చిన రోజున 50, 60 మంది సినిమా ప్ర‌ముఖుల‌తో పాటు ఎంతో మంది అభిమానులు ఎయిర్‌ఫోర్ట్‌లో ఎదురు చూశామ‌ని చెప్పారు.

Advertisement

ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ అంద‌రినీ చూసి చాలా సంతోష‌ప‌డ్డార‌ని త‌మ ద‌గ్గ‌రికీ వ‌చ్చి ప‌లుక‌రించార‌ని గుర్తు చేశారు. ఆ త‌రువాత ఎన్టీఆర్ ఓ రోజు రాత్రి స‌మావేశాన్ని ఏర్పాటు చేశార‌ని తెలిపారు. అక్క‌డ అంద‌రితో కాసేపు స‌ర‌దాగా కాసేపు స‌ర‌దాగా మాట్లాడారు. ఆ రోజు రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు అలా జ‌రిగింద‌ని, ఇక హోట‌ల్‌కు వెళ్లి ప‌డుకున్నామ‌ని చెప్పారు. ఆ త‌రువాత రోజు ఉద‌యాన్నే మ‌ద్రాస్‌కు వెళ్లాక రాత్రి జ‌రిగిన ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నామ‌ని రామారావు అస‌లు విష‌యం అప్పుడు చెప్పార‌ని తెలిపారు. ఆ విష‌యం చెప్ప‌డంతో త‌న‌కు క‌డుపు మండిపోయింద‌ని ముర‌ళీమోహ‌న్ చెప్పాడు.

ముఖ్యంగా న‌టుల కంటే గొప్ప‌గా రాజ‌కీయ నాయ‌కులు న‌టిస్తున్నార‌ని రాత్రి ఏమి తెలియ‌ని వారిగా అంద‌రితో బాగా ఉన్నాడ‌ని తెల్లారేస‌రికి త‌న‌ను ముఖ్య‌మంత్రిగా దించేశారు అని చెప్ప‌డంతో క‌డుపు మండిపోయింది అని తెలిపారు. వెంట‌నే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ‌, ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో మొత్తం ప్ర‌చారం చేశామ‌ని గుర్తు చేశారు. ఆ త‌రువాత నెల రోజుల‌కే ఎన్టీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కార‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

Also Read :  అదృష్టం అంటే ఈమెదె.. 50 ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్.. కోటి ఫ్యాకేజీతో జాబ్‌..!

Visitors Are Also Reading