Home » హిజాబ్ వివాదంపై కంగనా రనౌత్ ఏమ‌న్నారంటే..?

హిజాబ్ వివాదంపై కంగనా రనౌత్ ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే కంగ‌నా ర‌నౌత్ తాజాగా హిజాబ్ వివాదంపై స్పందించారు. క‌ర్ణాట‌క‌లో కొద్ది రోజులుగా హిజాబ్ పై న‌డుస్తున్న కాంట్ర‌వ‌ర్సీపై ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె రెస్పాండ్ అయ్యారు. ర‌చ‌యిత ఆనంద్ రంగ‌నాథ‌న్ చేసిన పోస్ట్‌ను ఆమె స్క్రీన్ షాట్ తీసి దానిపై మీకు ధైర్యం చూపించాల‌ని ఉంటే అప్ఝానిస్తాన్‌కు వెళ్లి బుర‌ఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛ‌గా ఉండండి. మిమ్మ‌ల్ని మీరు బంధించుకోకండి అంటూ పోస్ట్ చేశారు కంగ‌నా.

Also Read :  త‌న ల‌వ‌ర్ పేరు బ‌య‌ట‌పెట్టిన ప్రియ‌మ‌ణి.. ఎవ‌రో తెలుసా..?

Advertisement

Advertisement

ముఖ్యంగా పాఠ‌శాల‌ల్లో హిజాబ్ నిషేదించ‌డంపై రంగ‌నాథ‌న్ వ్య‌తిరేకంగా ఉన్నారు. ఈ త‌రుణంలోనే ఆయ‌న చేసిన పోస్ట్‌లో ఇరాన్ 1973లో అని బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు ప్ర‌స్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోల‌తో చ‌రిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాల‌నుకుంటున్నారని పోస్ట్ చేశారు.

ఉడిపిలోని గ‌వ‌ర్న‌మెంట్ క‌ళాశాల‌లో మొద‌లైన హిజాబ్ వివాదం క‌ర్ణాట‌క హై కోర్టు వ‌ర‌కు చేరింది. శాంతి, సామ‌ర‌స్యంతో ఉండాలంటూ సీఎం సైతం మూడు రోజుల పాటు విద్యాసంస్థ‌లు మూసేయాల‌ని పిలుపునిచ్చారు. దీనిపై క‌ర్ణాట‌క హై కోర్టు విచార‌ణ జ‌రుపుతున్న తరుణంలో మ‌త‌ప‌ర‌మైన దుస్తుల‌ను తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు ధ‌రించ‌కూడ‌దు అని హై కోర్టు తేల్చి చెప్పిన‌ది.

Also Read :  James : పునిత్ రాజ్‌కుమార్ చివ‌రి సినిమా టీజ‌ర్ విడుద‌ల

Visitors Are Also Reading