కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకస్మికంగా మరణించిన విషయం అందరికీ తెలిసినదే. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గత ఏడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. నేటికి ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
Advertisement
Also Read : తన లవర్ పేరు బయటపెట్టిన ప్రియమణి.. ఎవరో తెలుసా..?
అయితే ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. మార్చి 17న జేమ్స్ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా జేమ్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం విధితమే. అయితే ఇందులో ఆయన సైనికుడిలా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా, టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు.
Advertisement
Advertisement
మార్చి 17న జేమ్స్ చిత్రం విడుదలవుతుండటంతో కర్నాటకలో ఆయన మృతికి గుర్తింపుగా మార్చి 17 నుంచి మార్చి 23 వరకు వారం రోజుల పాటు కర్నాటక ఏ ఇతర సినిమాను ఆడకుండా కేవలం జేమ్స్ మాత్రమే ఆడేవిధంగా నిర్ణయం తీసుకున్నారు అక్కడి సినీ పెద్దలు. ముఖ్యంగా గన్స్ పట్టుకుని నిలబడే వంద వేస్ట్ బాడీస్ కంటే గన్ లాంటి వాడిని ఒక్కన్నీ వెతికి తీసుకురండి. ఎదురు నిలబడి కాపాడటం తెలిసి ఉండాలి. ఎదురొచ్చి గుండెల్లో బుల్లెట్ దింపడం తెలిసి ఉండాలని శ్రీకాంత్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నాతో పోటీకి వచ్చిన వారెవ్వరూ గెలిచిన రికార్డులు లేవు. నాకు మొదటి నుంచి రికార్డులు బ్రేకు చేయడమే తెలుసు అని పునిత్ రాజ్ కుమార్ డైలాగ్‌లు టీజర్‌లో అదుర్స్ అనిపించాయి.