Home » త‌న ల‌వ‌ర్ పేరు బ‌య‌ట‌పెట్టిన ప్రియ‌మ‌ణి.. ఎవ‌రో తెలుసా..?

త‌న ల‌వ‌ర్ పేరు బ‌య‌ట‌పెట్టిన ప్రియ‌మ‌ణి.. ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ భామ ప్రియ‌మ‌ణి అంటే ఇప్ప‌టికీ అభిమానుల‌కు క‌నుల‌విందే. న‌ట‌న‌తో పాటు సొగ‌సైన అందాలు పంచ‌డంలో ప్రియ‌మ‌ణి రూటే సెప‌రేటని అంటుంటారు ఆమె అభిమానులు. పెళ్లి త‌రువాత వ‌ర‌స అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది భామ‌. తెలుగులో తొలుత 2003 లో ఎవ‌రే అత‌గాడు సినిమాతో ప‌రిచ‌య‌మైంది. అప్పుడు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా చేరుకోలేక‌పోయిన ప్రియ‌మ‌ణి ఆ త‌రువాత త‌మిళం వైపు కొన్నాళ్లు దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప‌రుత్తివీర‌న్ లో అద్భుతంగా న‌టించి 2006లో జాతీయ ఉత్త‌మ న‌టి పుర‌స్కారం అందుకుంది.

Also Read :  KHILADI REVIEW : ర‌వితేజ ఖిలాడీ రివ్వ్యూ…బొమ్మ హిట్టా ఫ‌ట్టా !

Advertisement

ఆ త‌రువాత జ‌గ‌ప‌తి బాబు హీరోగా పెళ్లైన కొత్త‌లో.. సినిమాలో న‌టించింది. ఇక అప్ప‌టి నుంచి టాలీవుడ్‌లో ఆమె సుడి తిరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి త‌రువాత కూడా వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఈమె నార‌ప్ప సినిమాలో సుంద‌ర‌మ్మ‌గా అద‌ర‌గొట్టింది. తాజాగా బిగ్‌బాస్ కాజ‌ల్ ప్రియ‌మ‌ణిని ఓ ఇంట‌ర్వ్యూ చేసింది. నీ జివితంలో ఎప్పుడైనా క్ర‌ష్ వ‌చ్చిందా అనే ప్ర‌శ్న‌కు ప్రియ‌మ‌ణి స‌మాధానం చెప్పింది. నా జీవితంలో చాలా సంద‌ర్భాల్లో క్ర‌ష్ వ‌చ్చింది.

Advertisement

తాను చిన్న‌ప్పుడు చూస్తే యంగ‌ర్ సల్మాన్‌ఖాన్‌. స‌ల్మాన్ యంగ్‌గా ఉన్న‌ప్పుడు త‌న ముఖం చాలా అందంగా ఉండేద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా నిజ‌జీవితంలో అనుప‌మ‌, ప్రియ‌మ‌ణిల‌ను పోల్చ‌డం మీకెలా అనిపిస్తుంద‌న‌గా.. అనుప‌మ వేరు, ప్రియ‌మ‌ణి వేరు. అనుప‌మ ఇంట్రెస్టింగ్ వేరు.. ఎక్క‌డ ఏమి జ‌రుగుతుంద‌నేది ఆమె చాలా తెలుసు. ప్రియ‌మ‌ణికి మాత్రం ప‌క్కింట్లో ఏమి జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి అని పేర్కొంది.

ఇవాళ ప్రియ‌మ‌ణి న‌టించిన‌ బామ క‌లాపం థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ సిరీస్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ది. ఇందులో హీరోయిన్ ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సిరిస్‌లో ప్రియ‌మ‌ణి తెలుగు ఓటీటీ మాద్య‌మంలోకి అడుగుపెడుతుంది. అభిమ‌న్యు తాడి మేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ఈనెల 11న ఆహాలో ప్రసారం కానుంది. ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి విడుద‌ల అయిన ప్రోమోలు, పోస్ట‌ర్, ఫ‌స్ట్ గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. సినిమా కూడా ఇవాళ ఓటీటీలో విడుద‌ల‌వ్వ‌డంతో ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా కామెడీ కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Also Read :  సీఎం జ‌గ‌న్‌తో ఎవ‌రు ఏమి మాట్లాడారు..?

Visitors Are Also Reading