ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలను చూస్తే.. వాస్తవానికి ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే అవి ఊహించని విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మొన్నటికి మొన్న ఓ కోతికి పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహించిన వీడియో ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఓ ఆవుకు కూడా అదేవిధంగా ఇలాగే అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి విరాళాలు అందజేసి మరీ నిర్వహించారు. జంతువులకు కూడా మనుషుల మాదిరిగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
Also Read : ఆరోగ్యం కోసం అద్భుత వాస్తు చిట్కాలు.. ఇవి అస్సలు విస్మరించకూడదు..?
Advertisement
Advertisement
ముఖ్యంగా మరణించిన వాటికే అంత్యక్రియలు కాదండోయ్.. బతికి ఉన్న వాటికి కూడా పుట్టిన రోజు వేడుకలు జరపడం చూస్తున్నాం. మొన్న ఓ ధనవంతుడు తన కుక్క పుట్టిన రోజుకు ఏకంగా రూ.10లక్షలు ఖర్చు చేసిన విషయం తెలిసినదే. అంతకు ముందు ఓ కుక్కకు శ్రీమంతాన్ని కూడా చేశారు. ఇలా మనుషుల సంప్రదాయాలను జంతువుల విషయంలో కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు ఓ నెమలి విషయంలో కూడా ఇలాగే చేశారు. ఈ సారి అధికారులే దగ్గరుండి నిర్వహించారు.
రాజస్తాన్ రాష్ట్రంలోని ఝంఝను జిల్లాలో ఓ నెమలి విద్యుత్ఘాతంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జాతీయ పక్షి నెమలికి లాంఛనంగా అంత్యక్రియలు చేశారు. నెమలి శవం మీద జాతీయ జెండాను కూడా కప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో పోలీస్, అటవీశాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : Lata Mangeshkar : లతా మంగేష్కర్ చివరి పాట ఏమిటంటే..?