మానవ శరీరానికి కచ్చితంగా కావాల్సిన వాటిలో లవణం కూడా ఒకటి. శరీర జీవక్రియలు సమర్థవంతంగా పని చేయాలంటే ఉప్పు తీసుకోవాలి. అయితే ఉప్పు వాడితే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని చాలా నమ్ముతుంటారు. అది నిజమే కానీ అతిగా తీసుకున్నప్పుడే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా తీసుకుంటే శరీరంలో నీరు, ఉప్పు ఈ రెండింటి సమతౌల్యం సమంగా ఉంటే ఎలాంటి సమస్యలుండవు. ఇక ముఖ్యంగా ఉప్ప నీరుతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
Advertisement
Advertisement
రక్తపోటును అదుపు చేయాలంటే సోడియం కావాలి. అందుకే ఉప్పు నీరు తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఎక్కువ మాత్రం తీసుకుంటే ప్రమాదం. చాలా మితంగా మాత్రమే ఉప్పు నీరు తీసుకోవాలి. అదేవిధంగా ఉప్పు నీరు తాగడం వల్ల పొట్ట, పేగులు పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి. కడుపు నొప్పితో బాధపడేవారు కొద్దిగా ఉప్పునీరు తీసుకుంటే తక్షణ ఉపశమనం పొందవచ్చు. జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉప్పు నీటితో ముక్కు లోపల శుభ్రం చేసుకోవడం గొంతులో ఆ నీరు పోసుకుని పుక్కిలించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక దంతాలు , చిగుల్లు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉప్పు నీరు ఎంతో గ్రేట్‌గా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజు ఉప్పు నీరు నోట్లో పోసుకుని పుక్కిలిస్తే.. బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. నోటి దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది.