సాధారణంగా రాజకీయాల్లో రాణించాలని కొనేవారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు నామినేషన్ వేసి పోటీ పడుతూ ఉంటారు. అయితే కొంతమంది మొదటిసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయరు. మరికొంతమంది రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆ తర్వాత తమకు రాజకీయాలు సెట్ కావని వదిలేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 226 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేదు.
అయినప్పటికీ మరో సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఆ వ్యక్తి పేరు పద్మ రాజన్. తమిళనాడుకు చెందిన పద్మ రాజన్ కు ఎలక్షన్ కింగ్ గా ఎంతో గుర్తింపు ఉంది. పద్మరాజన్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీకి దిగడం ఇది 227వ సారి కానుంది. మొదటిసారిగా పద్మ రాజన్ 1980లో మెట్టురు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇప్పటి వరకు ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ ఓడిపోయారు.
Advertisement
Advertisement
అయినప్పటికీ వెన్ను చూపకుండా ప్రధానులు, రాష్ట్రపతుల పైన కూడా పోటీ చేస్తూ వస్తున్నారు. ఈయనki నంద్యాలలో పి.వి.నరసింహారావు పైన కూడా పోటీ చేసిన రికార్డు ఉంది. చాలామంది ఒకే నియోజకవర్గం నుంచి ఒక ప్రాంతం నుంచి అనేక సార్లు గెలిచి రికార్డులు క్రియేట్ చేసారు. కానీ పద్మరాజన్ మాత్రం అందరికంటే ఎక్కువ సార్లు ఓడిపోయి ఎలక్షన్ కింగ్ గా రికార్డ్ క్రియేట్ చేశారు.