RCB vs SRH : RCB కెప్టెన్ డూప్లెసెస్ బౌలింగ్లో 30 నుండి 40 పరుగులు అదనంగా ఇచ్చామని ఈ తప్పు వలనే విజయాన్ని అందుకోలేకపోయామని అన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం ఆర్సీబీ తలపడింది. 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్ కి నాలుగో విజయం దక్కింది. ఆర్సిబికి ఇది ఆరవ పరాజయం. ఈ మ్యాచ్ తర్వాత ఓటమిపై స్పందించిన ఆర్సిబి కెప్టెన్ ఫాఫ్ డూప్లెసెస్ విజయం కోసం తమ ఆటగాళ్లు చివరిదాకా పోరాడడం గొప్ప విషయం అని అన్నారు.
Advertisement
Also read:
ఈ బ్యాటింగ్ ప్రదర్శన మెరుగయింది. సరైన T20 వికెట్ ఫలితం గురించి ఆలోచించకుండా లక్ష్యాన్ని సమీపంగా వచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. 280 పరుగుల లక్ష్యం అనేది చాలా ఎక్కువ. ఛేదించడం చాలా కష్టం. మా పేసర్లు దారుణంగా విఫలమయ్యారని డూప్లెసెస్ అన్నారు. బ్యాటింగ్ విభాగం లోని కొన్ని సమస్యలు వచ్చాయని వాటి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
Advertisement
Also read:
Also read:
భారీ లక్ష్యమైనా కూడా ఆటగాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ఆఖరి దాకా పోరాడారు అని అన్నారు. ఆటగాళ్ల ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉందని 30 నుండి 40 పరుగులు బౌలింగ్లో అదనంగా ఇచ్చేసామని ఈ ఫలితం కారణంగా ఓటమిపాలయ్యామని అన్నారు. ఐపీఎల్ లో ఎప్పుడు ఏం చోటు చేసుకుంటుంది అనేది ఎవరు ఊహించలేము. ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!