Ramanaidu: రామానాయుడు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మామూలుగా ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా అదృష్టం బాగుండాలి. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పనికిరాదు. టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసి రావాలి ఇక నిర్మాత రామానాయుడు విషయానికి వస్తే ఒకసారి రామానాయుడు ఊరు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయారట. ఆయనని అదృష్టం తట్టి లేపింది. ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్గా ఎదగడానికి దారి వచ్చింది. వాస్తవానికి రామానాయుడు అంతకుముందే ఎన్నో రంగాల్లో వ్యాపారాలు చేశారు. బాగా నష్టపోయారు. చివరికి సినిమా రంగంలో అదృష్టముని పరీక్షించుకోవాలని అడవి రాముడు సినిమాతో ఎన్టీఆర్ హీరోగా మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తారు.
Advertisement
మొదటి సినిమా బానే వర్కౌట్ అయింది. కానీ తర్వాత సినిమాలు నష్టాలు తీసుకువచ్చాయి ఇంకా ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు ఆ టైంలో రామానాయుడు ప్రేమనగర్ అనే సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. సినిమా చేయాల్సింది మాత్రం రామానాయుడు కాదు. దాని వెనుక చాలా విషయం ఉంది. కోడూరి కౌసల్యాదేవి రాసిన ప్రేమనగర్ అనే ఒక నవలని సినిమాగా తీయాలని అనుకున్నారు శ్రీధర్ రెడ్డి. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు.
Advertisement
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
- బాలకృష్ణ, హరికృష్ణలు కలిసి నటించిన 3 సినిమాలు!
బట్టలు షాపింగ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి అయిన భార్య వెళుతున్న టైం లో యాక్సిడెంట్ అయ్యింది అపశఖంగా భావించి మూవీని తీయకూడదని భావించారు. అక్కినేని రామానాయుడు కి విషయం చెప్పడంతో ఏదైతే అది జరిగింది ఈ సినిమా ఎలా అయినా తీసేస్తాను ఒకవేళ నష్టం వస్తే ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వేసి నాకున్న 90 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటానని చెప్పారట రామానాయుడు శ్రీధర్ రెడ్డి దగ్గర 60 వేలకి సినిమా రైట్స్ ని కొన్నారు. వాణిశ్రీ ని హీరోయిన్ గా అక్కినేని హీరోగా 15 లక్షల రూపాయలు తో తెరకెక్కించారు. నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు సహాయం చేశారు. అప్పట్లో ఈ సినిమాకి ఐదు లక్షల పెట్టి సెట్ వేశారు. భారీ వసూళ్లు తో పాటుగా అందరి ఆదరణ లభించింది. 50 లక్షల కి పైగా వసూలు చేసింది ప్రేమనగర్ సినిమా. ఇలా రామనాయుడు లైఫ్ టర్న్ అయిపోయింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!