Home » ఈ మంచి లక్షణాల వల్లే.. మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు..!

ఈ మంచి లక్షణాల వల్లే.. మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు..!

by Sravya
Ad

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో ఫేమస్ అయ్యారు చిరు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో హిట్ కొట్టేశారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలని పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా రంగంలో ఎవరి అండ లేకుండా స్వయంకృషితో వచ్చి ఇప్పుడు కూడా ఎంతో మందికి ఆదర్శంగా వుంటున్నారు. చిరంజీవి మొదటి నటించిన పునాదిరాళ్లు అయితే ప్రాణం ఖరీదు మొదటి విడుదలైన మూవీ. ఆయన నటించిన ఆరు సినిమాల తర్వాత పునాదిరాళ్లు రిలీజ్ అయింది. 1980 వరకు దాదాపు 15 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు చిరంజీవి. అప్పట్లో చిరు కుటుంబం నెల్లూరులో ఉండేవారు 1980లో వచ్చిన జాతర సినిమాలో ఆయన హీరోగా నటించారు.

Advertisement

ఆ సినిమా లో ఒక కాస్ట్యూమ్ ఆయనకు చాలా ఇష్టం. తెల్ల ప్యాంటు బ్లూ షర్ట్ ఆ డ్రెస్ లో ప్రెస్ మీట్ కి వెళ్తే బాగుంటుంది అనిపించి రుద్ర సీతారామరాజుకి ఫోన్ చేసి కాస్ట్యూమ్ విషయం గురించి చెప్పారు దానికి నిర్మాత జాగ్రత్త గా పెట్టమని కాస్ట్యూమ్ ని బయటకు తీసి వాష్ చేయించి రెడీగా పెట్టారట. ఉదయమే వచ్చి తీసుకుని వెళ్ళమన్నారట. ఆగస్టు 21 ఉదయం నిర్మాత సీతారామరాజు ఆఫీస్ కి వెళ్లారు చిరంజీవి. అప్పటికే చిరంజీవి కి ఒక ఫియట్ కారుని కొనిచ్చారు అయిన తండ్రి. ఆ కారులోనే సినిమా ఆఫీసులకు వెళ్లేవారు. సీతారామరాజు ఆఫీస్ లో ఉదయం రుచికరమైన టిఫిన్ పెట్టేవారట. దాంతో కొందరు నిర్మాతలు అక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్లేవారు. దర్శకుడు ఆఫీస్ కి వెళ్తే ఆ కారులో నిర్మాత బయటకి వెళ్లిపోయారట. ఎంతసేపైనా తిరిగి రాలేదట. చిరంజీవి మాత్రం ఆయన కోసం ఓపికగా ఎదురు చూశారు.

Advertisement

చివరికి నాలుగున్నరకి ఆ నిర్మాత వచ్చారు ఉదయం 12:00 కి వెళ్ళిన ఆయన సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు. సారీ తమ్ముడు ఎవరో సైట్ చూద్దామంటే బీచ్ రోడ్ కి వెళ్ళాము అని కారు కీస్ ఇచ్చారట చిరంజీవి ఏ మాత్రం కోప్పడకుండా పర్వాలేదని నవ్వుతూ సమాధానం చెప్పారట. సాయంత్రం ఐదు గంటలకి మిత్రుడు హరిప్రసాద్ నిర్మాత రుద్ర సీతారామరాజు తో కలిసి నెల్లూరు బయలుదేరారు చిరంజీవి. అప్పటికి ప్రెస్ మీట్ అయిపోయింది తనతో పాటు వచ్చిన నిర్మాత సీతారామరాజుకి మంచి హోటల్లో రూమ్ తీసి ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పారట. ఇలా చిరు కి వుండే ఈ మంచి లక్షణాల వలన అందరివాడు అయ్యారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading