Home » అరటి ఆకు కషాయంతో ఎన్నో ఆకులకు దివ్యౌషదం..!

అరటి ఆకు కషాయంతో ఎన్నో ఆకులకు దివ్యౌషదం..!

by Anji
Ad

ఇప్పుడంటే సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. వైద్యశాస్త్రంలో అద్భుతాలు జరుగుతున్నాయి. గుండె తీసి గుండె పెడుతున్నారు. అయితే పూర్వకాలంలో వైద్యం కోసం ఆయుర్వేదంపై ఆధారపడేవారు. కొన్ని రకాల ఆకులు, కషాయాలతో చాలా వ్యాధులకు చెక్ పెట్టేవారు.

Advertisement

Advertisement

పూర్వీకులు పాటించిన కొన్ని పద్ధతులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది సైన్స్ కూడా కాదనలేదు. ఇప్పుడు అరటి ఆకు కషాయం.. దాని బెనిఫిట్స్ చెప్పబోతున్నాం. ఏదైనా చిన్న గాయం అయితే అరటి ఆకు రసం తాగితే త్వరగా మానుతుంది. అరటి ఆకులో ఐస్ ముక్కను చుట్టి తలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రిలీఫ్ ఉంటుంది. అరటి ఆకు రసాన్ని అప్లై చేయడం వల్ల చర్మ అలర్జీ ఉన్నవారికి సహాయపడుతుంది. అరటి ఆకు కషాయాన్ని తాగితే జ్వరం కూడా తగ్గుతుంది. అరటి ఆకులను కొద్దిగా నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఎండిన అరటి ఆకుల కషాయం తీసుకోవడం వల్ల రక్తస్రావంతో కూడిన విరేచనాలు నయమవుతాయి. అరటి ఆకు రసాన్ని తీసుకుని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి కొంత సమయం తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు బాగా పెరుగుతుంది. కాలిన గాయాలు ఉంటే అరటి ఆకును అల్లం నూనెలో ముంచి గాయంపై కడితే… త్వరగా మానుతుంది. గర్భిణీ స్త్రీలు అరటి ఆకులను తినడం అలవాటు చేసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. అరటి ఆకు రసాన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు, దురద వంటి సమస్యలు నయమవుతాయి. అరటి ఆకు రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్న సమాచారం. ఈ హోం రెమెడీస్‌ను ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

Visitors Are Also Reading