Home » ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం

ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం

by Anji
Published: Last Updated on
Ad

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో యూపీ నుంచి మొత్తం ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు.

Advertisement

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా ఎనిమిది మంది అభ్యర్థులు గెలిచారు. నేను ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. ఇద్దరు SP అభ్యర్థులు గెలిచినట్లయితే, నేను వారిని కూడా అభినందిస్తున్నాను’ అని అన్నారు. యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు గాను 8 సీట్లు గెలుచుకున్న తర్వాత ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్నోలో సంబురాలు జరుపుకున్నారు.

Advertisement

రాజ్య సభ ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు : 

సుధాన్షు త్రివేది- 38 ఓట్లు

ఆర్పీఎన్ సింగ్- 37

తేజ్వీర్ సింగ్- 38 ఓట్లు

నవీన్ జైన్- 38 ఓట్లు

రామ్‌జీ లాల్- 37 ఓట్లు

సాధన సింగ్- 38 ఓట్లు

సంగీతా బల్వంత్ – 38 ఓట్లు

అమర్‌పాల్ మౌర్య- 38 ఓట్లు

అలోక్ రంజన్- 19 ఓట్లు

జయా బచ్చన్ – 41 ఓట్లు

Also Read : లోక్‌పాల్ కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నియామకం

Visitors Are Also Reading