ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తులపై వస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది. పతంజలి యాడ్స్‌పై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు యోగా గురువు బాబా రామ్‌దేవ్, మేనిజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పతంజలి ఔషధ ఉత్పతుల యాడ్స్‌ను ఆపేయాలని ఆదేశించింది. అలోపతిపై తప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారించింది.
Advertisement
2023లో కూడా పతంజలి సంస్థ తమ ఉత్పతులను వినియోగిస్తే.. డయాబెటిస్, ఆస్తమా లాంటి రోగాల నుంచి పూర్తిగా కోలుకోవచ్చని ప్రకటనలు చేసింది. దీంతో ఐఎంఏ.. పతాంజలి సంస్థ యజమానులపై మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే.. ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటీ జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు పతంజలి సంస్థ యజమానులను హెచ్చరించింది. ఒకసారి వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్లీ ఇలా తప్పుడు యాడ్స్ ఇవ్వడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో కూడా పతంజలి సంస్థ తమ ఉత్పతులను వినియోగిస్తే.. డయాబెటిస్, ఆస్తమా లాంటి రోగాల నుంచి పూర్తిగా కోలుకోవచ్చని ప్రకటనలు చేసింది. దీంతో ఐఎంఏ.. పతాంజలి సంస్థ యజమానులపై మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే.. ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటీ జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు పతంజలి సంస్థ యజమానులను హెచ్చరించింది. ఒకసారి వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్లీ ఇలా తప్పుడు యాడ్స్ ఇవ్వడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Advertisement
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ పీఎస్ పట్వాలియా కోర్టులో ఈరోజు వాదనలు వినిపించారు. పతంజలి సంస్థ.. తమ ప్రొడక్ట్స్‌తో డయాబెటీస్, అస్తమా లాంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రకటలు చేసి నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అసలు ఇలాంటి రోగాలను శాశ్వత ఉపశమనం అంటే ఏంటి అని పతంజలి సంస్థను ప్రశ్నించింది. డయాబెటీస్, రక్తపోటు, అస్తమా, ఉబకాయం లాంటి రోగాలను శాశ్వతంగా నయం చేస్తామని ఎలా చెప్పుకోగలరంటూ నిలదీసింది. అల్లోపతిని ప్రజల దృష్టిలో ఈ విధంగా దిగజార్చే స్థాయికి తీసుకురాకూదని వ్యాఖ్యానించింది. తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.