Home » శరద్ పవార్ పార్టీ పేరు మార్పు.. ఇక నుంచి ఇదే..!

శరద్ పవార్ పార్టీ పేరు మార్పు.. ఇక నుంచి ఇదే..!

by Anji
Ad

ఎట్టకేలకు క ఎన్నికల సంఘం నుంచి శరద్ పవార్ వర్గానికి కొత్త పేరును కేటాయించింది. ఆయన సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -ఎన్‌సీపీ శరద్‌ చంద్ర పవార్‌’పేరుగా ఖరారు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు శరద్ పవార్‌కు ఎదురు దెబ్బ తగిలిన ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే నిజమైన ఎన్‌సిపిగా పరిగణించడం గమనార్హం.

Advertisement

అటువంటి పరిస్థితిలో, అజిత్ పవార్ వర్గం NCP పేరు, ఎన్నికల చిహ్నం రెండింటిపై నియంత్రణ కలిగి ఉంది. త్వరలోనే మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ వర్గం ఎన్నికల కమిషన్ నుండి మూడు పేర్లను డిమాండ్ చేసింది. శరద్ వర్గం గుర్తు కోసం మర్రి చెట్టును డిమాండ్ చేసింది. శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్రావు పవార్ పేర్లను ఎన్నికల సంఘం ముందు సమర్పించింది. అందులో ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పేరును ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement

శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య విభేదాల తరువాత ఎన్సీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక గ్రూపు శరద్ పవార్ కాగా, మరొకటి అజిత్ పవార్. ఇదిలా ఉండగా.. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్సీపీగా పరిగణించింది. ఉత్తర్వు ఇచ్చేటప్పుడు, అజిత్ పవార్ నిజమైన ఎన్‌సిపి అని ఎన్నికల సంఘం అంగీకరించింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం శరద్ పవార్ వర్గానికి పెద్ద దెబ్బగా పరిగణిస్తోంది. కమిషన్ ఈ నిర్ణయం తర్వాత, ఎన్సీపీ పేరు, ఎన్నికల చిహ్నం రెండింటిపై అజిత్ పవార్ వర్గానికి హక్కు లభించింది.

Visitors Are Also Reading