Home » రేపటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!

రేపటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!

by Anji
Ad

భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6నఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

Advertisement

Advertisement

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇంతకు ముందు కూడా భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమాటోలను విక్రయించడం గమనార్హం. భారత్ గోదుమపిండిని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 06, 2023న ప్రారంభించింది. దేశంలో సగటు గోదుమపిండి ధర రూ.35 ఉండగా.. భారత్ గోదుమపిండి ధర రూ.27.50 కే లభిస్తుంది. శనగ పప్పు కిలో రూ.60కి లభిస్తుంది. భారత్ రైస్ కి సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్ రైస్ తో సామాన్య ప్రజలకు లాభం చేకూరనుంది.

 

Visitors Are Also Reading