Home » అది కేసీఆర్ ఆడిన నాటకం.. ఉత్తమ్‌ షాకింగ్ కామెంట్స్

అది కేసీఆర్ ఆడిన నాటకం.. ఉత్తమ్‌ షాకింగ్ కామెంట్స్

by Anji
Ad

బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్ధాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణ నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు. వీళ్ళ పరిపాలన అసమర్థత వల్లనే కృష్ణ జల్లాలో రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఏ ప్రతిపదికన తీసుకున్నా వీళ్ళు చేసింది తప్పేనన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆన్‌రికార్డ్స్‌లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు.

Advertisement

Advertisement

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి 56 రోజుల పాలనలో మేము ఎక్కడా ఒప్పుకోలేదన్నారు ఉత్తమ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 10ఏళ్ళ లో పూర్తి చేయలేదని.. బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు ఉత్తమ్. తెలంగాణలో నీటి కేటాయింపుల్లో మోసం, కేఆర్‌ఎంబీకి ప్రాజెక్ట్ లు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రావిటీ ద్వారా రావాల్సిన ఎనిమిది టీఎంసీల కృష్ణా జలాల నీటిని కేసిఆర్, జగన్ ఏకాంతంగా మాట్లాడుకుని ఏపీకి అప్పగించారని ఆరోపించారు. మేము KRMBకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకోమన్నారు.

తెలంగాణ వచ్చింది వీళ్ళ వల్ల కాదు.. చిదంబరం కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించడం వల్లేనని తెలిపారు.  కేసీఆర్ తెలంగాణలో ఓట్లను ప్రభావితం చేయడానికి తెలంగాణలో  నవంబర్ 30న ఎన్నికల రోజే  జగన్‌తో మాట్లాడి CRPFని నాగార్జున సాగర్ డ్యామ్  మీదకు పంపి కుట్ర చేశారన్నారు. రాజకీయంగా కుట్ర చేయడానికి ఇది కేసీఆర్‌ ఆడిన నాటకమని విమర్శించారు ఉత్తమ్.

మరిన్నీ  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading