Home » తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

రాష్ట్ర సచివాలయంలో  తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో ఇవాళ  కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా  ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్  భేటీ జరిగిన అనంతరం మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. 

Advertisement

Advertisement

  • రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’
  • వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌.. టీజీగా మార్పు
  • రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం
  • తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం
  • రూ.500 లకు గ్యాస్ సిలిండర్‌కు ఆమోదం
  • 200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు గ్రీన్ సిగ్నల్
  • మూతబడ్జ నిజాం షుగర్ కార్మాగారను పునురుద్దిరించేలా నిర్ణయం
  • తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం
  • కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం
  • సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.
  • అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం.
  • ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ.
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభం

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading