Home » కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్ కౌంటర్..!

కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. హరీశ్ కౌంటర్..!

by Anji
Ad

సాగునీటి ప్రాజెక్టులపై రెండు ప్రత్యేకంగా రెండు రోజులపాటు ప్రత్యేకంగా చర్చిద్దామని వెల్లడించారు.ఈ చర్చకు కేసీఆర్ తప్పకుండా హాజరుకావాలని సూచించారు. చర్చలో భాగంగా కేసీఆర్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.  చర్చిలో తనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతామన్న రేవంత్ రెడ్డి చర్చ జరిగినంతసేపు కేసీఆర్ అసెంబ్లీలోనే ఉండాలని తెలిపారు.60 ఏళ్లలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు.అలాగే ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు.

Advertisement

Advertisement

రేవంత్ వ్యాఖ్యలకు  మాజీ మంత్రి హరీశ్ కౌంటర్‌ ఇచ్చారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదు. నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టాం.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ప్రాజెక్టులను అప్పగించి సంతకం పెట్టింది. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టింది. రేవంత్ దగ్గర విషయం లేదు కనుకే విషం చిమ్ముతున్నాడు. రేవంత్ నీ అతి తెలివి బంద్ చేయి. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? బిల్లును తయారుచేసింది మీ జైపాల్ రెడ్డి, జైరాం రమేశ్ కాదా? రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నీటి సమస్యలను తీసుకొస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు.

Visitors Are Also Reading