Home » మాజీ డీహెచ్ గడల కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు..!

మాజీ డీహెచ్ గడల కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు..!

by Anji
Ad

మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కాళ్లు మొక్కిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన  కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజారోగ్య సంచాలకులుగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు శ్రీనివాసరావు. ముఖ్యంగా కరోనా సమయంలో తన పనితీరు, ప్రెస్‌ మీట్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రసంగాలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

Advertisement

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కరించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. అయితే, బీఆర్‌ఎస్ పార్టీ చివరి నిమిషంలో వనమా వేంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. దీంతో గడల శ్రీనివాసరావు మనస్తాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు.. ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి టికెట్‌ను ఆశిస్తూ.. ఆ రెండు సీట్లకు ఫిబ్రవరి 2న గాంధీభవన్‌లో దరఖాస్తు చేశారు.

Advertisement

 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దిగింది. యువకులకు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సాహించింది. రికార్డు స్థాయిలో 52 మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎంతో కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం.. బీఆర్‌ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది.

మరిన్నీ తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading