ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.. కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు షా మెహమూద్ ఖురేషీకి కూడా ‘సైఫర్’ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
ఇమ్రాన్‌ఖాన్‌కు శిక్ష పడిన తర్వాత ఆయన పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ పై నిషేధం విధించే అవకాశం ఉందని పాక్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రమేయం ఉన్న పీటీఐ వ్యవస్థాపకుడు, ఇతర నేతలపై తీర్పు వెలువడిన తర్వాత పీటీఐని నిషేధించడం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి నిధులపై అనేక సంవత్సరాల విచారణ తర్వాత పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆగస్టు 2003లో పార్టీకి ‘నిషేధించబడిన నిధులు’ అందాయని ఏకగ్రీవంగా ప్రకటించింది.
ఇది పాక్ ముస్లిం లీగ్-నవాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ ప్రభుత్వానికి పార్టీని రద్దు చేయడానికి అవకాశం కల్పించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ కు అనర్హుడయ్యారు.