Home » బీజేపీని గెలిపిస్తే చివరి ఎన్నికలు.. ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్స్ వైరల్

బీజేపీని గెలిపిస్తే చివరి ఎన్నికలు.. ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్స్ వైరల్

by Anji
Ad

బీజేపీని గెలిపిస్తే దేశంలో అవే ఆఖరి ఎన్నికలవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లి కార్జున ఖర్గే. పుతిన్‌ లాగే మోదీ నియంత లాగా మారుతారని ఆరోపించారు. అలాగే సామాజిక న్యాయం బీజేపీతో అసాధ్యమని , కులగణనతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్‌గాంధీ.

Advertisement

ఆయనతో పాటు భువనేశ్వర్‌ సభలో పాల్గొన్న మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోడీ, బీజేపీ పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ గెలిస్తే లోక్‌సభకు ఇవే ఆఖరి ఎన్నికలవుతాయన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో మోదీ నియంతృత్వాన్ని ప్రకటిస్తారని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ లాగే జీవితకాలం పదవిలో ఉండేందుకు మోదీ కుట్ర చేశారని ఆరోపించారు. బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ ప్రజల్లో విషాన్ని నింపుతున్నాయని ఆరోపించారు ఖర్గే. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ బీజేపీకి బీటీమ్‌ లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. బీహార్‌ సీఎం నితీష్‌ను బెదిరించి ఎన్డీఏ కూటమిలో చేర్చకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. విపక్ష నేతలను ఈడీ, సీబీఐతో మోదీ బెదిరిస్తున్నారని అన్నారు ఖర్గే.

Advertisement

మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్‌ యాత్ర బిహార్‌ లోకి ప్రవేశించింది. ఇండియా కూటమికి సీఎం నితీష్‌ గుడ్‌బై చెప్పిన మరుసటి రోజే రాహుల్‌ జోడో యాత్ర బిహార్‌ లోని కిషన్‌గంజ్‌ లోకి ప్రవేశించింది. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్‌గాంధీ. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ తోనే సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణనను కేంద్రం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు రాహుల్‌గాంధీ. కులగణనతో దేశంలో ఓబీసీలు, మైనారిటీలు , ఆదివాసీల జనాభా తేలుతుందన్నారు.

Visitors Are Also Reading