పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో న్యూమోనియా విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వ్యాధి తీవ్రమైన చలిలో ప్రాణాంతకంగా మారుతుంది. జనవరి నెలలో న్యూమోనియా కారణంగా ఇప్పటివరకు కనీసం 244 మంది మరణించినట్టు సమాచారం. పంజాబ్ లో గత 24 గంటల్లో మరో ఏడుగురు యువకులు మరణించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ వైద్యారోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో మొత్తం పంజాబ్ ప్రావిన్స్ లో 942 కొత్త నిమోనియా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో 212 కొత్త కేసులు లాహోర్ లోనే నిర్ధారించబడ్డాయి.
Advertisement
జనవరి నెలలోనే పంజాబ్లో 244 మంది మరణించగా అందులో 50 మంది ఒక్క లాహోర్ నగరంలోనే ఉండడం గమనార్హం. మరణాల పెరుగుదల శీతాకాలంలో పొగ మంచు వల్ల కలిగే కాలుష్యం కారణంగానే ఉంది. చలికాలంలో పొగ మంచు కారణంగా న్యూమోనియా కేసులు పెరుగుతాయని వైద్య అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. జలుబు, ఫ్లూ ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఐదు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు నిమోనియాతో ఎక్కువగా బాధపడుతున్నారు.
Advertisement
మరోవైపు మరణించిన చాలామంది పిల్లలకు నిమోనియా టీకాలు వేయలేదని పంజాబ్ ఆపధర్మ ప్రభుత్వం పేర్కొంటుంది. పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు. దానికి కారణంగా వారు చాలా బలహీనంగా ఉన్నారు. వైరస్ తో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవడం వల్ల వారు చనిపోయారు. తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం పంజాబ్ ప్రావిన్స్ లోని పాఠశాలల్లో ఉదయం సమావేశాలను జనవరి 31 వరకు ప్రభుత్వం నిషేధించింది. పంజాబ్ లోని ఆరోగ్య అధికారులు న్యుమోనియా వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించడంతోపాటు ఇతర ముఖ్యమైన చర్యలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.