Home » కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Anji
Ad

కాంగ్రెస్‌కి 100 రోజులే డెడ్‌లైన్.. హామీలు అమలుచేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానీతో కాంగ్రెస్ సర్కారు ఒప్పందంతో పాటు బీజేపీ ఎంపీల తీరుపైనా విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఏక్‌నాథ్ షిండే అయ్యే అవకాశముందని కేటీఆర్ అన్నారు.

Advertisement

Advertisement

రేవంత్ రెడ్డికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎష్ మూలలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆయన ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనన్న కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయన్నారు.  గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని.. వారు రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ వచ్చిన తర్వాతే మనం బొట్టు పెట్టడం నేర్చుకున్నామా..? గుడిలో కి వెళ్లడం వాళ్లు మనకు నేర్పరా? మనం హిందువులం కదా..? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు దేవుడి తో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలన్నారు. ఈ విషయంలో బండి సంజయ్‌తో తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. వినోద్ కుమార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి బహిరంగ చర్చకు వస్తారని ఛాలెంజ్ చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading