Home » Siddharth: సిద్ధార్థ్ తన భార్యను ఎందుకు వదిలేసాడు ?

Siddharth: సిద్ధార్థ్ తన భార్యను ఎందుకు వదిలేసాడు ?

by Bunty
Published: Last Updated on
Ad

హీరో సిద్ధార్థ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఎంతోమంది అమ్మాయిల మనసులను సొంతం చేసుకున్నాడు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సిద్ధార్థ్ కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ చెన్నైకి చెందిన వ్యక్తి. ఇతను తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషాచిత్రాల్లో కూడా సినిమాలు చేశాడు.

siddarth-wife

Advertisement

 

ఇక సిద్ధార్థ్ వ్యక్తిగత విషయానికి వస్తే… ఇతనికి వివాహమై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. 2003 సంవత్సరంలోనే సిద్ధార్థ్ తన ఎదురింట్లో ఉంటున్న అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం వీరి బంధం ఎక్కువకాలం నిలవలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహమైన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులు తీసుకునే సమయానికి వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. విడాకుల అనంతరం తన కుమారుడి బాధ్యతలని సిద్ధార్థ్ చూసుకుంటున్నాడు.

siddarth

ఇక విడాకులు అనంతరం సిద్ధార్థ్ ఇప్పటి వరకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో అదితిరావుతో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం కూడా చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఇంతవరకు సిద్ధార్థ్ స్పందించలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ కలిసి జంటగా వెళ్లడం, ఫంక్షన్స్ కి, సినిమాలకి, పార్టీలకి కలిసి వెళ్తున్నారు. దీంతో వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై సిద్ధార్థ్, అదితి ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading