Home » ఆపదలో డేవిడ్ వార్నర్…రంగంలోకి ప్రధాని

ఆపదలో డేవిడ్ వార్నర్…రంగంలోకి ప్రధాని

by Bunty

 

ఆస్ట్రేలియా విధ్వాంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ గత కొద్ది రోజులుగా విషాదంలో ఉన్నాడు. దానికి కారణం తనకు ఇష్టమైన బ్యాగ్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. తనకు ఇష్టమైన వస్తువులన్నీ ఆ బ్యాగులోనే ఉన్నాయి. తన పిల్లల వస్తువులతో పాటు అందులో బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. దీనితో వార్నర్ తెగ బాధపడిపోయాడు. ఎవరికైనా బ్యాగు దొరికితే తెచ్చివ్వండి ప్లీజ్ అంటూ వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వార్నర్ బాధను చూసి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి చలించిపోయాడు. ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ ఆల్బెనీస్ మాట్లాడుతూ… డేవిడ్ వార్నర్ 100కు పైగా టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున పోరాడాడు.

చివరి టెస్ట్ ఆడుతున్న వార్నర్ బ్యాగ్ పోగొట్టుకోవడం బాధాకరమని అందరూ అతని కోసం సహాయం చేయడానికి ప్రయత్నించండి అంటూ ప్రధాని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభుత్వం నుంచి కూడా వార్నర్ కు సపోర్ట్ అందింది. బ్యాగు కోసం విస్తృతంగా గాలించారు. రెండు రోజుల తర్వాత సిడ్నీలోని ఆస్ట్రేలియాలో జట్టు ఉంటున్న హోటల్లో క్యాప్ దొరికింది. దీంతో వార్నర్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నా బ్యాగీ గ్రీన్ ను తిరిగి పొందినందుకు సంతోషంగా ఉంది. ప్రతి క్రికెటర్ కు ఇది ఎంతో కీలకం.

బ్యాగీ గ్రీన్ ను వెతకడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు కెరీర్ మొదట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్ ను అందుకుంటారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా స్వీకరిస్తారు. అలాంటి బ్యాగ్ పైగా వార్నర్ చివరి టెస్ట్ ముందు కనిపించకపోవడంతో వార్నర్ తెగ బాధపడిపోయాడు. వార్నర్ ప్రస్తుతం కెరియర్ లో ఆఖరి టెస్ట్ ఆడుతున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ వార్నర్ కు ఆఖరి టెస్ట్. అంతేకాదు వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు వార్నర్ ఇదివరకే అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో వార్నర్ కు ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading