Home » Ambati Rayudu : వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. తెరవెనుక జరిగింది ఇదేనా!

Ambati Rayudu : వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. తెరవెనుక జరిగింది ఇదేనా!

by Bunty
Ad

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. గత పది రోజుల కిందట వైసీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కండువా కప్పి మరీ అంబటి రాయుడును పార్టీలో చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

Ambati Rayudu Quits YCP Unraveling Political Twists

Ambati Rayudu Quits YCP Unraveling Political Twists

అంతేకాదు గుంటూరు ఎంపీ టికెట్ అంబటి రాయుడుకు ఇస్తారని సోషల్ మీడియాలో కూడా వార్త వైరల్ అయింది. కానీ చివరికి ఆ టికెట్ అంబటి రాయుడుకు ఇవ్వమని వైసిపి అధిష్టానం స్పష్టం చేసిందట. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారట. కానీ తనకు గుంటూరు పార్లమెంటు టికెట్ మాత్రమే కావాలని మొండి పట్టు పట్టారట అంబటి రాయుడు. దానికి వైసిపి అధిష్టానం అంగీకారం తెలపకపోవడంతో వైసిపి పార్టీకి అంబటి రాయుడు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ మేరకు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు అంబటి రాయుడు. దీంతో అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ మరోసారి వివాదంగా మారింది. ఐసీఎల్ లో చేరడం, రంజీలో గొడవలు, హర్భజన్ తో గొడవ, అంపైర్లను తిట్టడం, బీసీసీఐ మీద నెగటివ్ ట్వీట్…. ఇలా అంబటి రాయుడు కేరీర్ మొత్తం తొందరపాటు నిర్ణయాలే… ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తొందరపాటు ముంచేసింది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading