ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార వైసీపీ పార్టీని ఓడించాలని గట్టిగానే కంకణం కట్టుకున్నాయి. ఇక, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే జనసేన, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చెయ్యాలని సిద్ధం అవుతోంది. ఈ క్రమం లోనే అధికార వైసీపీ పార్టీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతోంది.
Advertisement
వైసీపీ పాలన బాగున్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ఉన్న నిరసన కారణంగా వైసీపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అని వై ఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేలను పిలిచి మంతనాలు జరుపుతున్నారు. ఫలితంగా.. కొందరు వైసీపీ నేతలకు ఈసారి టిక్కెట్ దక్కే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. ఈసారి నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు అంటూ వార్తలు వచ్చాయి.
Advertisement
ఈ వార్తలపై ఇప్పటికే స్పందించిన ఆర్ కె రోజా తనకి టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా.. జగన్ కోసమే పని చేస్తానని స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నగరి ఎమ్మెల్యే రోజా కు కూడా పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. రోజాకు ఈ విషయాన్నీ జగన్ అధికారికంగా చెప్పనున్నారా? అని చర్చలు జరుగుతున్నాయి. మరి రోజాకు ఏపీ సీఎం వై ఎస్ జగన్ ఏ విధంగా నచ్చ చెపుతారు? అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!