తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరక్టర్లు వాళ్ళ ప్రతిభను చూపించుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ ఉంటారు.నిజానికి ఇలాంటి దర్శకులు చాలా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ కొంతమంది తీసే సినిమాల్లో మాత్రం వాళ్ళ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తమదైన రీతిలో సక్సెస్ లను కొడుతూ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తూ వచ్చారు.
Advertisement
అలాగే రాజమౌళి కూడా తన సినిమా మేకింగ్ తో తన సత్తా చూపించుకుంటూ రావడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అది ఇప్పుడున్న దర్శకులు. ఆ స్టాండర్డ్స్ లో కాకుండా నార్మల్ గా సినిమాలను చేస్తున్నారు. అయితే ఒకప్పుడు పూరి జగన్నాథ్ చాలా మంచి సినిమాలు తీశారు. ఆ డైరెక్టర్ ను రీప్లేస్ చేసే డైరెక్టర్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరనే చెప్పాలి. ఇంకా రాజమౌళి అంటే ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనని రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
పూరి జగన్నాథ్ ఇంతకు ముందు ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ప్రస్తుతం ఆయన మళ్లీ తన ఫామ్ ని పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లైగర్ లాంటి సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి తను ఫుల్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమా వల్లనే తను ఒక పెద్ద సక్సెస్ కూడా కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే పూరి జగన్నాథ్ ని రీప్లేస్ చేసే డైరెక్టర్ లేడనే చెప్పాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!