ఇండియాలో రకరకాల ఆహారపదార్థాలను ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే వాటిలో మనం చాలా ఇష్టంగా తినే కొన్ని ఆహారపదార్థాలు అసలు మనదేశంలో పుట్టినవే కాదు. ఇతర దేశాల ఆహారపదార్థాలు అయినప్పటికీ మనం వాటిని ఓన్ చేసుకున్నాం. ఆ ఫుట్ ఐటమ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Advertisement
సమోసా
సమోసాను ఇష్టపడని వాళ్లు ఉండరు. నార్త్ సౌత్ ఇలా ఎక్కడా చూసినా సమోసా లవర్స్ కనిపిస్తూ ఉంటారు. అయితే ఎంతో ఇష్టపడి తినే సమోసా అసలు మన దేశానికి చెందినది కాదు. ఇది మధ్య ప్రాశ్చ్యంలో అక్కడి వారు సమోసాను తినేవాళ్లు. అక్కడ నుండి వలసలు రావడంతో సమోసా కూడా మనదేశానికి వచ్చేసింది.
చికెన్ టిక్కా
చికెన్ టిక్కా స్కాట్ లాండ్ దేశంలో చెఫ్ అలీ మహ్మద్ సృష్టించారు. అక్కడ నుండి పంజాబ్ చేరుకుంది. ప్రస్తుతం దేశం మొత్తం దీన్ని ఇష్టపడుతోంది.
Advertisement
బిర్యానీ
ప్రతిఒక్కరూ లొట్టలేసుకునే బిర్యానీ కూడా మనది కాదు. బిర్యానీ మొదట పర్షియా దేశంలో తయారు చేశారు. కానీ ఇప్పుడు బిర్యానీ అంటే హైదరాబాద్ అని ఫేమస్ అయ్యింది.
దాల్ రైస్
ప్రతి ఇంట్లో ఎంతో ఇష్టంగా తినే దాల్ రైస్ అంటే పప్పన్నం కూడా మనది కాదు. ఇది నేపాల్ లో పుట్టింది. కానీ ఇప్పుడు మన ఆహారాల్లో భాగం అయిపోయింది.
గులాబ్ జామూన్
స్వీట్లలో ప్రతి ఒక్కరూ ఇష్టపడేది గులాబ్ జామూన్..నేను స్వీట్లు తినను కానీ గులాబ్ జామూన్ తింటా అని చాలా మంది చెబతుంటారు. ఈ గులాబ్ జామూన్ పుట్టింది పర్షియా దేశంలో.