సినీ ఇండస్ట్రీలో వారసత్వం కామన్! ఇది ఎక్కువగా హీరోస్ లలో చూస్తుంటాం కానీ ప్రస్తుతం హీరోయిన్స్ కూడా తమ కూతుళ్లను హీరోయిన్స్ గా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. వీరిలో చాలా మంది సక్సెస్ కూడా అయ్యారు.
లక్ష్మి- ఐశ్వర్య
ఓ బేబి సినిమాలో వీరిద్దరూ తల్లికూతుళ్లుగా నటించారు.
Advertisement
శ్రీదేవి – జాన్వికపూర్
శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
Also read: దంగల్ నటిపై నెటిజన్లు ప్రశంసలు
లిజి- కళ్యాణి ప్రియదర్శన్
అఖిల్ ఫస్ట్ మూవీ హలో సినిమాలో హీరోయిన్ గా చేసిన కళ్యాణి ప్రియదర్శన్ …ప్రముఖ మలయాలి నటి లిజి కూతురు. లిజి కూడా నితిన్ లై సినిమాతో మళ్లీ టాలివుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
మేనక – కీర్తిసురేశ్
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ తల్లి మేనక…ఈమె పున్నమినాగు సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించింది
మంజుల – వనిత, శ్రీదేవి,ప్రీతి
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజులకి ముగ్గురు కూతుర్లు సినిమాల్లోకి వచ్చారు.
Advertisement
- వనిత: కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.
- ప్రీతి: ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాల్లో నటించింది.
- శ్రీదేవి: ప్రభాస్ మొదటి చిత్రమైన ఈశ్వర్ లో నటించింది.
రాధ – కార్తిక,తులసి
ఎనభైల్లో ఇండస్ట్రీ హిట్ హీరోయిన్ అయిన రాధ ఇద్దరు కూతుళ్లు హీరోయిన్స్ గా చేశారు.
- కార్తిక : నాగచైతన్య తొలి మూవీ జోష్ తో ఇండస్ట్రీకి పరిచయం
- తులసి: మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన కడలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం
జీవిత – శివాని,శివాత్మిక
రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. శివాత్మిక దొరసాని చిత్రంతో ఆకట్టుకుంది.
సారిక – శృతిహాసన్, అక్షర హాసన్
కమల్ హాసన్, సారికల కూతుళ్లైన శృతిహాసన్, అక్షర హాసన్ లు కూడా హీరోయిన్స్ గా మంచి గుర్తింపు పొందారు. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా పేరు గడించింది.
కమల్ హాసన్, సారికల కూతుళ్లైన శృతిహాసన్, అక్షర హాసన్ లు కూడా హీరోయిన్స్ గా మంచి గుర్తింపు పొందారు. శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా పేరు గడించింది.
Also Read: కల్తీ పాలను ఎలా తయారు చేస్తారు….ఆ పాలు తాగితే ఏం జరుగుతుంది ….!