తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రకటించిన రిజల్ట్స్ లో ఎక్కువగా సీట్లు రాకపోయినా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మాత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా.. 64 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షం అయిన సీపీఐ పార్టీకి ఒక సీటు వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం 65 సీట్లకు చేరుకుంది.
అటు భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఐఎంఐ పార్టీకి 7 సీట్లు వచ్చాయి. రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనుంది. అయితే.. 10 ఏళ్లు పరిపాలన చేసిన సీఎం కేసీఆర్ ను ఓడించడం వెనుక ఓ అదృష్ట శక్తి ఉంది. ఆ శక్తి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Advertisement
తెలంగాణలో అన్ని తానై నడిపించిన ఎన్నికల స్ట్రాటజిస్టు సునీల్. సోనియా గాంధీ సునీల్ ను పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ లో సభ్యునిగా నియమించారు. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలు 2014లో నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. విజయవాడకు చెందిన సునీల్ కనుగోలు కుటుంబం చాలా ఏళ్ళ క్రితమే తమిళనాడులో స్థిరపడింది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్…. ప్రపంచ దిగ్గజ సంస్థ మేక్ కిన్సీలో కన్సల్టెంట్ గా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ ను ఎలా అయితే ‘పీకే’గా పిలుస్తారో…. సునీల్ కనుగోలును ‘ఎస్కే’ అనే పొట్టి పేరుతో పిలుస్తారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.