ఎక్కడ చూసినా బర్రెలక్క బర్రెలక్క అని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఎవరి నోట విన్న ఇదే వినపడుతోంది. బర్రెల అక్క వీడియోలు, ఆమెపై పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపాలెం మండలం బర్రెలక్క స్వస్థలం. అసలు పేరు వచ్చేసి కర్ని శిరీష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఈమె బీకాం చేశారు అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిద్ధమవుతోంది.
టీపీఎస్సీ పరీక్షల్లో పేపర్లు లీకులు, కోర్టు కేసులు పరీక్షలు వాయిదా పడడం వంటి వాటి వల్ల తీవ్ర నిరాశ చెందింది. ఉద్యోగాలు రావట్లేదని బర్రెలు కాస్తున్నానని నిరుద్యోగి శిరీష తీసిన వీడియోలు సోషల్ మీడియాని విపరీతంగా షాక్ చేశాయి. అలా శిరీష బర్రెలక్క అయిపోయింది కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఈమెకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. సాధారణంగా ఎన్నికలంటే ఎన్నో వేల కోట్లని ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ సాధారణ అమ్మాయి ఎన్నికల్లో ఎలా సక్సెస్ సాధిస్తుంది…?
Advertisement
Advertisement
అయినా కూడా ఆమె ధైర్యంతో నిలబడింది ఈమె చేసే ఈల శబ్దానికి దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులులో కూడా భయం మొదలైంది శిరీష తన ప్రచారంలో భాగంగా యూట్యూబ్లో ఒక పాటని కూడా రిలీజ్ చేసింది. ఆమెకు మద్దతుగా నిలుద్దామంటూ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్థన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ అభ్యర్థిగా సుధాకర్ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!