Home » కోట బొమ్మాళి సినిమా తీయడానికి కారణం అదేనా..? డైరెక్టర్ ఏమన్నాడంటే..?

కోట బొమ్మాళి సినిమా తీయడానికి కారణం అదేనా..? డైరెక్టర్ ఏమన్నాడంటే..?

by Anji
Ad

హీరో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఈనెల 24న పంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ తేజ మార్ని మాట్లాడుతూ.. కోట బొమ్మాళి సినిమాను నేను గత సంవత్సరమే కథ రాసుకున్నాను. ఈ సినిమా జర్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. సినిమా గురించి మాట్లాడాలంటే ముందు లింగిడి లింగిడి పాట గురించి చెప్పాలి. ఆ పాట బాణి కట్టించి తయారు చేయించినప్పుడు మధ్యలో చిన్న లిరిక్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చింది.

Advertisement

నాకు ఒక నాలుగు లైన్ల కోసం అందరు రచయితల దగ్గరికి వెళ్లాను. అప్పుడు ఒక లిరిసిస్ట్ ఇది ఒక పాటేనా.. దీన్ని ఎవడైనా పాట అంటాడా? ఇలాంటి దాన్ని మీరు మళ్ళీ రాయమని అనడం అంటూ మెసేజ్ పెట్టాడు. చాలామందిని అడిగాను కానీ ఎవ్వరూ రాయలేకపోయారు. దీంతో దీన్ని ఎందుకు నేను మార్చాలి. అలాగే ఉంచుతా అయిపోతుంది కదా అనుకున్నా చివరకు ఆ పాట హిట్ అయింది అన్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీసు చేజింగ్ పోలీసు. ప్రస్తుతం పోలీసులు ఎలా నలిగిపోతున్నారో మేము చూపించాలని అనుకున్నాం. ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మల్లా తయారవుతారు అనేది మేము టచ్ చేశాం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్ గారిని ఎయిర్ పోర్ట్ లో ఆపడం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఇలాంటి సినారియోను చూసి కథ రాసుకున్న ఇది.

Advertisement

ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ మా సినిమా వచ్చి చూడాలి. మీరు కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. టెక్నీషియన్స్ పరంగా చూస్తే మా కెమెరామెన్ జగదీష్ గారు బాగా సపోర్ట్ చేశారు. బన్నీ వాసు గారు, విద్యా మేడమ్ కూడా మద్దతు ఇచ్చారు. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అన్నారు. నేను మధ్యలో ఈ ప్రాజెక్టులోకి వచ్చినా కూడా వాళ్లంతా నాకు చాలా మద్దతు ఇచ్చారు. రీ రికార్డింగ్ అందించిన రంజాన్ రాజ్ కానీ, ఇతర టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్టు చేశారు. సినిమాలో రామకృష్ణ క్యారెక్టర్ బాగుంటుంది. క్యారెక్టర్ ను మీరు మరిచిపోరు. ఆ క్యారెక్టర్స్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరికి థాంక్స్. నన్ను సపోర్ట్ చేసినందుకు గీత ఆర్ట్స్ కు, శ్రీకాంత్, రాహుల్, శివాని అందరికీ ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading