Home » శ్రీకాంత్ 100వ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఏంటో తెలుసా ?

శ్రీకాంత్ 100వ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో.. విలన్ గా నటించి.. ఆ తరువాత హీరోగా నటించాడు. మళ్లీ ఇప్పుడు విలన్ పాత్రల్లో, హీరోకు అన్నగా,బాబాయ్ గా నటిస్తున్నాడు. అయితే ఈయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తన 100వ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమానే మహాత్మ.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  డిజాస్టర్ గా  నిలిచింది.

Advertisement

అప్పటికే దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని ఫ్లాప్ సినిమాలు తీశాడు.  ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ నటించడంతో ఆ సినిమా హిట్ అయింది. దీంతో తన 100వ సినిమా కి కృష్ణవంశీ అయితే బాగుంటుందని భావించాడు.అలా కృష్ణవంశీ  దర్శకత్వంలో మహాత్మ మూవీ తెరకెక్కింది. మహాత్మ మూవీలో  హీరోయిన్‌గా భావన నటించింది. అప్పటికే గోపిచంద్ హీరోగా నటించిన ఒంటరి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది భావన. ఈ సినిమాకి ఆమెను తీసుకుందామనుకున్న సమయంలో భావన చాలా బొద్దుగా ఉందట. అయితే మహాత్మ సినిమా కోసం కాస్త తగ్గింది భావన. సాధారణంగా ఒక హీరోయిన్ అంటే నడుము నాజుకుగా ఉండాలి. కానీ భావన నడుము బొద్దుగా ఉండేది. 

Advertisement

సినిమా స్టోరీ, సాంగ్స్ బాగాలేకనో ఏమో  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరోయిన్ పొట్టభాగమే అంటూ ప్రచారం చేశారు. హీరోయిన్ భావన లావుగా ఉండటం వల్లనే ఈ సినిమా హిట్ కాలేదని టాక్ వినిపించింది. మహాత్మ మూవీలో హీరోయిన్ భావన స్థానంలో వేరే హీరోయిన్ ని తీసుకుంటే శ్రీకాంత్ 100వ సినిమా కచ్చితంగా 100 రోజులు ఆడేదంటూ.. అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శ్రీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ వైపు అడుగులు వేస్తుండటంతో అప్పటి 100వ సినిమా గురించి ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading