Home » టీ-20 ప్ర‌పంచక‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

టీ-20 ప్ర‌పంచక‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

2022 లో ఆస్ట్రేలియాలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్ టీ-20 షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 16న నుండి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. రెండు గ్రూపులుగా సూప‌ర్‌-12 మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. ప్ర‌తం గ్రూపు-1 ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఆప్ఝ‌నిస్తాన్ ఉండ‌గా.. గ్రూపు-2లో భార‌త్ , పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఉన్నాయి. మిగ‌తా జ‌ట్లు క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ ఆడి సూప‌ర్‌-12లోకి రంగ ప్ర‌వేశం చేస్తాయి.

టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్... - Great Telangaana T20 World Cup Schedule  Release

Advertisement

Advertisement

అక్టోబ‌ర్ 23న హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఆరోజు భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌టప‌డ‌నున్నాయి. గ‌త టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ మాదిరిగానే వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ ఇండియా పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నున్న‌ది. న‌వంబ‌ర్ 09న తొలి సెమిఫైన‌ల్‌, న‌వంబ‌ర్ 10న రెండో సెమీఫైన‌ల్‌, నిర్వ‌హిస్తారు. న‌వంబ‌ర్ 13న మెల్‌బోర్న్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. అటు క్వాలిఫయ‌ర్ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌, న‌మీబియా, వెస్టిండిస్‌, స్కాట్లాండ్ స‌హా మ‌రొక రెండు జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఇక టీ-20 ప్ర‌పంచ క‌ప్ తేదీలు విడుద‌ల‌య్యాయి. కాబ‌ట్టి ఆ తేదీల‌ను లాక్ చేసుకోండి. మీ ప్లాన్ సిద్ధం చేసుకోండి. క్రీడా సంబ‌రానికి సిద్ధం కండి.

టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading