Home » నైట్ షిఫ్ట్ ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇలా చెక్ పెట్టండి….!

నైట్ షిఫ్ట్ ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇలా చెక్ పెట్టండి….!

by AJAY
Ad

ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నైట్ షిఫ్ట్ కూడా ఒకటి. విదేశాల్లోని సాఫ్ట్వేర్ కంపెనీల కోసం మన దగ్గర చాలా కంపెనీలు నైట్ షిఫ్ట్ ను ఏర్పాటు చేశాయి. ఐటి రంగంతో పాటు ఫార్మా, తయారీ రంగాలలోనూ నైట్ షిఫ్ట్ లు కనిపిస్తుంటాయి. అయితే రాత్రిపూట ఉద్యోగాలు చేసే వారి ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందట. రాత్రిళ్లు నిద్రను పక్కన పెట్టి ఉద్యోగం చేయడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Advertisement

నైట్ షిఫ్ట్ వల్ల మరియు మారిపోయే షిఫ్ట్ ల వల్ల అల్జీమర్స్, డిమెన్షియా సమస్యలు తలెత్తుతాయి. నైట్ షిఫ్ట్ ల వల్ల రాత్రి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటే అది షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ పెరిగేందుకు దారితీస్తుంది. షిఫ్టుల్లో మార్పులతో సీరంలో యాక్టివ్ ప్రోటీన్ పెరిగి రక్తనాళాలలో వాపులు వచ్చే ప్రమాదం ఉందట. బీపీ పెరిగి గుండె జబ్బులకు దారితీసే అవకాశం కూడా ఉందట.

Advertisement

అంతేకాకుండా షుగర్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరాలు ఉదయం పూట ఆహారం తీసుకోవడానికి మాత్రమే పని చేస్తాయని రాత్రుల్లో ఆహారం తీసుకుంటే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని టిప్స్ ద్వారా నైట్ షిఫ్ట్ లు చేసేవాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రుళ్లు ఉద్యోగం చేసే వారు తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోకూడదు. రాత్రివేళ స్నాక్స్ తీసుకోవడం వల్ల సుగర్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. రాత్రులు స్నాక్స్ తీసుకోవడం వల్ల రెండు వారాల్లోనే కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Visitors Are Also Reading