టీమ్ ఇండియా స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడం లేదు. మొన్న టెస్ట్‌సిరీస్‌ను కోల్పోయిన ఇండియా జట్టు.. వన్టే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి 31 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 296 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తరువాత బ్యాంటింగ్ చేసి భారత్ 265 పరుగుల వద్దనే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించగా.. ముఖ్యంగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్ కూడా తన బ్యాటింగ్ పవర్ ఏమిటో చూపించాడు. శార్దూల్ ఠాకూర్ 43 బంతుల్లో 50 పరుగులు చేసి వన్డేల్లో అర్థ సెంచరీ చేశాడు.
Advertisement
Advertisement
శార్దూల్ ఠాకూర్ టెస్ట్ కెరీర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై హాప్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా గబ్బా మైదానంలో శార్దూల్ తన తొలి టెస్ట్ హాప్ సెంచరీని నమోదు చేసాడు. శార్దూల్ ఓవరాల్‌గా వరుసగా 2 అర్థసెంచరీలు సాధించాడు. ఇప్పుడు అతను దక్షిణాఫ్రికాలో కూడా వన్డే అర్థసెంచరీ సాధించాడు.
దేశాలలో వన్డే , టెస్ట్ ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన భారతదేశం నుంచి నాలుగవ లోయర్ ఆర్డర్ ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. అతని కంటే ముందు కపిల్‌దేవ్, అజిత్ అగార్కర్, రవీంద్ర జడేజాలు ఈ ఘనత సాధించారు. బ్యాట్‌తో అద్బుత ప్రదర్శన చేస్తున్న శార్దూల్ బంతి మాత్రం రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో శార్దూల్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో 3 నో బాల్స్ కూడా వేయడం గమనార్హం.