Home » చ‌లికాలంలో అందంగా క‌నిపించాలంటే ఇవి తీసుకోవాల్సిందే..!

చ‌లికాలంలో అందంగా క‌నిపించాలంటే ఇవి తీసుకోవాల్సిందే..!

by Anji
Ad

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌క‌నుగుణంగా ఆహారంలో కూడా మార్పులు చేయాలి. కీళ్ల నొప్పులు, బ‌రువు పెర‌గ‌డం, విట‌మిన్ డీ లోపం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటివి చ‌లికాలంలో ప్ర‌జ‌లు ఎదుర్కునే సాధార‌ణ స‌మ‌స్య‌లు. చ‌ర్మం పొడిబార‌డం, జుట్టు రాల‌డం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాకుండా మెరిసే చ‌ర్మాన్ని జుట్టుకు బ‌లాన్ని అందిస్తాయి.చ‌ర్మాన్ని మృదువుగా, ముడుత‌లు రాకుండా కాపాడుతాయి. శీతాకాలంలో ఆరోగ్య‌క‌ర‌మైన, మృదువైన చ‌ర్మం కోసం ప్ర‌త్యేక‌మైన డైట్ మెయింటెన్ చేయాలి. అవి ఏమిటో తెలుసుకుందాం.

నీరు

Advertisement

15 benefits of drinking water and other water facts
చ‌ర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచ‌డానికి నీరు చాలా ముఖ్యం. త‌గినంతగా నీరు తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా ఉంటుంది. ఇది చ‌ర్మం పొడిబార‌డం, ముడ‌త‌ల‌ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. త‌క్కువ నీరు తాగ‌డం వ‌ల్ల డీ హైడ్రేష‌న్ కు గుర‌వుతారు. ఇది అలస‌ట‌కు దారి తీయ‌వ‌చ్చు. ముస‌లివారిగా క‌నిపించ‌వ్చు.

కొవ్వు ఆమ్లాలు

 

Many Wall-nuts. Close Up Of Nuts. Stock Photo, Picture And Royalty Free  Image. Image 606922.

వాల్ న‌ట్‌లు, అవిసె గింజ‌లు, సాల్మ‌న్ మాకెరెల్ వంటి చేప‌ల‌లో ఉండే ఓమెగా 3 ప్యాటీ యాసిడ్‌లు చ‌ర్మాన్ని మృదువుగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ర్మాన్ని హైడ్రేట్గా ఉంచుకోవ‌డానికి ఈ ఆహారాలు తింటూ ఉండాలి.

క్యారెట్

Advertisement

క్యారెట్ గూర్చి నమ్మలేని నిజాలు!! - మన ఆరోగ్యం - Best Health Info

క్యారెట్‌లో బీటా కెరోటిన్ లైకోపిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇది చ‌ర్మాన్ని దెబ్బ‌తిన‌కుండా ర‌క్షిస్తుంది. క్యారెట్‌లో విట‌మిన్ ఏ పొటాషియం యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి పొడి చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

ఆమ్ల ఫ‌లాలు

How Dangerous is a Lack of Fruit and Vegetables?

శీతాకాలంలో మీరు తాజా జ్యూసి పండ్ల‌ను తినొచ్చు. ఇందులో నారింజ‌, ద్రాక్ష వంటి పండ్లుంటాయి. ఈ విట‌మిన్ సి-రిచ్ పండ్లు. శీతాకాలంలో ఉత్త‌మ సూప‌ర్ పుడ్స్‌. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో  విటమిన్ సి-రిచ్ పండ్లు శీతాకాలంలో ఉత్తమ సూపర్ ఫుడ్స్. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

చిల‌గ‌డ దుంప

sweet potato health benefits: చిలగడ దుంప క్యాన్సర్‌ నిరోధిస్తుందా? రోగ  నిరోధక శక్తి పెంచుతుందా? - nutrient contents in sweet potato and health  benefits | Samayam Telugu
చిల‌గ‌డ దుంప‌ల‌ను ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. స్వీట్ పొటాటోలో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు క‌డుపు నిండిన అనుభూతిని క‌లిగిస్తుంది. చిల‌గ‌డ దుంప‌లో ఉండే అధిక స్థాయి బీటా కెరోటిన్ చ‌ర్మానికి పోష‌ణ‌ను అందించ‌డ‌మే కాకుండా మెరిసే విధంగా చేస్తుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి సాధార‌ణ వ్యాధుల నుంచి శ‌రీరాన్ని ర‌క్షించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Visitors Are Also Reading