టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే తన చివరి సీజన్ అని.. నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తన తీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్‌లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారినిగా నిలిచింది. 2001 సానియా మీర్జా తన కెరీర్‌ను ప్రారభించింది.
Advertisement
తన కెరీర్‌లో ఇప్పటి వరకు 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్‌లో 2012 లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్, మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్ యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోపీలు సాధించింది. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లి చేసుకుంది. 2018 లో మగ బిడ్డకు కూడా జన్మినిచ్చింది. తమ బిడ్డకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరును కూడా పెడుతున్నట్టు గతంలో షోయబ్ మాలిక్ ప్రకటించారు.
Advertisement
ఇదిలా ఉండగా.. దేశానికి, క్రీడా రంగానికి చేసిన సేవలకు కేంద్రప్రభుత్వం అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డులను 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులను పొందింది. సానియా మీర్జా చాలా కాలంగా సింగిల్స్ ఆడటం మానేసింది. డబుల్స్‌లో తన ర్యాంకు మెరుగు పడకపోవడంతో కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండవచ్చు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లలో ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ 2014లో అర్హత సాధించడంతో పాటు టైటిల్‌ను కూడా సానియా గెలుపొందారు. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆప్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించింది. అందులో 6 గోల్డ్ పతకాలున్నాయి. అక్టోబర్ 2005లో టైమ్ పత్రిక సానియాను 50 హీరోస్ ఆసియాగా పేర్కొన్నది.