సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 60 ఏళ్లు బతికితే చాలు అనుకున్న రోజుల్లో కొంత మంది సెంచరీ దాటుతుండడం శుభ పరిణామం. అయితే ఒక్క ఓ మహిళ అసలు పెళ్లి చేసుకుండా సన్యాసిగా ఉండాలనుకుంది. కానీ అనుకోకుండా పెళ్లి అయింది. ఆమెకు ఒకరు కాదు.. కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది సంతానం. ఆమె కుటుంబం అంతకంతకు పెరిగిపోతుంది. ఆమె 99 ఏళ్ల వయసులో 100వ మునిమనవడిని ఎత్తుకొని సంతోషంతో మురిసిపోతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కొల్లేర్ తన 100వ మునిమనవడిని కలిసి సంబరపడుతోంది.
ఇక ఆమె కొల్లేర్ మనవరాలు ఈ మధ్య కాలంలో తనకు పుట్టిన కుమారుడిని తీసుకెళ్లి ఆమె చేతుల్లో పెట్టగానే.. నేను చాలా అదృష్టవంతురాలిని అంటూ ఆ వృద్ధురాలు ఆనందంలో మునిగితేలింది. ఇక ఆ బుడతడికి కొల్లేర్‌తో పాటు ముత్తాత పేరు వచ్చే కొల్లెర్ విలియమ్ బాల్‌స్టర్‌గా నామకరణం చేశారని చెప్పడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 1922లో జన్మించిన మార్గరెట్ కొల్లేర్ కొద్ది రోజుల పాటు సన్యాసిగానే జీవించారు. కొద్దిరోజుల తరువాత విలియమ్ పరిచయం అవ్వడంతో ఆమె జీవితమే మారిపోయింది. వారు పెళ్లి చేసుకున్నారు. కాలక్రమంలో వారికి ఏకంగా 11 మంది సంతానం కలిగారు. ఆపై వారికి కూడా పెళ్లిళ్లు కావడంతో కొల్లేర్-విలియమ్స్‌కి 56 మంది మనవళ్లు, మనవరాళ్లు అయ్యారు. అయితే విలియమ్ కొన్నాళ్ల కిందటే మరణించారు.
Advertisement
Advertisement
మనవరాళ్లలో ఒకరైన క్రిస్టిన్ బాల్‌స్టర్ ఈనెల 4వ తేదీన మగశిశువు జన్మినిచ్చింది. కాగా ఆ బుడతడు కొల్లేర్‌కి 100వ మునిమనవడు కావడం విశేషం. ఇక ఈ అరుదైన సంఘటనపై ఆ వృద్ధురాలు స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేసింది. తాను ఎంతో అదృష్టవంతురాలునని పేర్కొంది. చాలా రోజుల పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించాను అని.. అందుకే ఓ పెద్ద కుటుంబం ఉండాలని భావించానని చెప్పుకొచ్చింది. అది ఎప్పుడో నెరవేరిందని సంబురపడిపోయింది. మరికొద్ది రోజుల్లోనే కొల్లెర్ వందో వసంతంలోకి అడుగుపెట్టబోతుంది. ఇక ఆమె 100 పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
Also Read :
దేశంలోనే అతిపెద్ద పొడవైన రైలు ఇదే.. 6 ఇంజిన్‌లు, 295 బోగీలు..!
అల్లుఅర్జున్ సతీమణి ఫోటోలపై కళ్యాణ్ దేవ్ ఆసక్తికరమైన కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్..!