Home » ‘పుష్ప’ వేసిన‌ బంతికి ’83’ డకౌటేనా..?

‘పుష్ప’ వేసిన‌ బంతికి ’83’ డకౌటేనా..?

by Anji
Ad

పుష్ప‌-దిరైజ్ సినిమా అంచ‌నాల‌ను మించి హిందీ బెల్ట్‌లో స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.50కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టి మంచి వసూళ్ల‌ను సాధిస్తోంది. 50 కోట్ల నుంచి 100 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేద‌నే టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ త‌రువాత పుష్ప బాలీవుడ్‌లో అంత‌టి స‌త్తాను చాటింది.

 

Pushpa Day 15 Box Office Collection: Allu Arjun's Film Shows Considerable  Drop! - Filmibeat

Advertisement

ఇదిలా ఉండ‌గా ఎంతో క్రేజీతో విడుద‌లైన 83 సినిమా తుస్సుమంది. షారూఖ్‌ఖాన్ జీరో కంటే డిజాస్ట‌ర్ చ‌ర్చా వేడెక్కిస్తుంది. ర‌ణ‌వీర్‌సింగ్ లాంటి స్టార్ ఎన‌ర్జిటిక్ హీరో న‌టించిన ఈ బ‌యోపిక్ చిత్రం 83. ఇండియన్ క్రికెట్ లో అత్యంత అద్భుతమైన అధ్యాయాన్ని పునఃసృష్టిస్తూ – 1983 ప్రపంచ కప్ విజయంపై తెరకెక్కిన సినిమా ఇది. 83 24 డిసెంబర్ 2021న థియేటర్లలోకి వచ్చింది. సెలబ్రిటీల నుండి ఈ సినిమాకి అద్భుతమైన రివ్యూలు రావడంతో ఉత్కంఠ పెరిగింది.

Advertisement

 

83 box office collection: Ranveer Singh starrer fights off competition,  earns Rs 93.28 crore | Entertainment News,The Indian Express

క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ గా రణవీర్ నటనను మెచ్చుకున్నారు. ఇవేవీ బాక్సాఫీస్ నంబర్లలో అయితే వర్కవుట్ కాలేదు. కానీ అంతిమంగా రిజల్ట్ రివ‌ర్స్ అయింది. షారుఖ్ ఖాన్ 2018 డిజాస్టర్ జీరోసినిమా కంటే ఈ చిత్రం పెద్ద రేంజులో ప్లాప్ ని పొందిందని టాక్ వినిపిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాలో ఏం తప్పు జరిగిందో అని ట్రేడ్ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు.పుష్ప – స్పైడ‌ర్‌మాన్‌ సినిమాల నుంచి పోటీ కూడా 83 సినిమాకి ప్రమాదకరంగానే మారిందన్న విశ్లేషణ ఓ రేంజ్‌లో సాగుతోంది. అదేవిధంగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఆందోళనకు ప్రధాన కారణం అయినప్పటికీ 83 సినిమా దుర్భరమైన బాక్స్ ఆఫీస్ నంబర్ లకు నిరాశ తప్పలేదు. ప్రజలు సినిమాలకు వెళ్తున్నారనడానికి డిసెంబర్ 17 వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా రూ. 300 కోట్ల మార్కును అధిగమించడాన్ని చక్కటి ఉదాహరణగా చూపిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు.

 

Visitors Are Also Reading