సాధారణంగా మనం 5 నుంచి 10 కేజీల చేపలను చూసి ఉంటాం. వాటినే ఎంత పెద్ద చేపో అని అంటాం.కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ లో ఉన్న ఈ చేపను చూస్తే మన రెండు కళ్లు సరిపోవు. ఎందుకంటే.. ఇక్కడ ఈ రోజు ఏకంగా 750 కేజీల భారీ టేకు చేప ను మృత్య కారులు వేటాడారు. ఆ భారీ టేకు చేపను మార్కెట్ తరలించడానిక ఏకంగా పెద్ద పెద్ద క్రెన్ల నే ఉపయోగించారు. ఈ భారీ టేకు చేప ను చూడటానికి జనాలు భారీగా గుమి కూడారు. ఈ 750 కేజీల భారీ టేకు చేప ఫోటోలు ప్రస్తుతం సోషల్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
Advertisement
అయితే అంతర్వేది కి చెందిన మృత్య కారులు సముద్రంలో పెద్ద వలతో చేపలు పడుతున్న సమయంలో ఈ భారీ టేకు చేప చిక్కింది. అయితే మొదటి దీనిని చేప అనుకోలేదట. అదో భారీ ఆకారం ఉన్న చేప అనుకున్నారట. అయితే కొద్ది సమయం తర్వాత అది టేకు చేప అని తెలుసుకున్న తర్వాత భారీ క్రేన్లతో ఆ చేప ను ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే ఈ భారీ చేపను పట్టడం కన్నా.. మార్కెట్ కు తరలించడం ఆ మృత్య కారులకు తల ప్రాణం తోకకు వచ్చింది. భారీ క్రెన్ల తో భారీ వాహానాల్లో ఈ చేపను మార్కెట్ తరలించారు. ఆ ట్రక్కు లో కే ఈ భారీ టేకు చేపను మార్కెట్ తకలించడం చాలా ఇబ్బంది పడ్డారు.
read more.. 2021 లో ట్రాఫిక్ చలనాలతో ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే